: రాజౌరీలోని మాంజుకొటే సెక్టార్‌లో పాకిస్థాన్ కాల్పులు
పాకిస్థాన్ తీరు మారడం లేదు. తమ వక్రబుద్ధిని ప్రదర్శిస్తూ భారత సైన్యం సహనాన్ని పరీక్షిస్తూనే ఉంది. భారత సైన్యం ఆ కాల్పులని దీటుగా ఎదుర్కొంటూ బుద్ధి చెబుతున్నా పాక్ బుద్ధి మార్చుకోవడం లేదు. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్‌లో మరోసారి పాకిస్థాన్ కాల్పుల విమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. రాజౌరీలోని మాంజుకోటే సెక్టార్‌లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు పాల్పడింది. భారత బలగాలు కాల్పులను తిప్పికొడుతున్నాయి. కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్ రేంజర్లను నిన్న భారత సైన్యం మట్టుబెట్టినప్పటికీ పాక్ అదే పనిని కొనసాగిస్తోంది.