: ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కొనేందుకు మా ప్ర‌భుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది: పాక్ ప్రధాని ష‌రీఫ్


ఉగ్ర‌వాదాన్ని ఎదుర్కొనేందుకు త‌మ‌ ప్ర‌భుత్వం తీవ్రంగా కృషి చేస్తోంద‌ని పాక్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ మ‌రోసారి పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో పీఎం ఆరోగ్య కార్డుల ప‌థ‌కాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము త‌ప్ప‌కుండా పాక్‌లో ఐదేళ్లు పాలన‌ చేస్తామని చెప్పారు. ముందుగా అనుకున్న ప్ర‌కార‌మే 2018లోనే ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు. పాక్‌లోని న‌వాజ్‌ ష‌రీఫ్ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టేందుకు పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ నేత‌ ఇమ్రాన్ ఖాన్ సిద్ధ‌మైన వేళ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌లే ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. వ‌చ్చేనెల 2న పార్ల‌మెంట్‌ను స్తంభింప‌చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ష‌రీఫ్ పై అనేక‌ అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

  • Loading...

More Telugu News