: కాకినాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి.. విలేకరికి గాయాలు
పరిసరాల పరిశుభ్రతపై తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలిగిస్తోన్న అవగాహన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు పాల్గొన్నారు. తన పర్యటనలో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్, దోమలపై దండయాత్ర కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. అయితే, ఈ సందర్భంగా అక్కడ అపశ్రుతి చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని మీడియా వాహనంపై నుంచి ఓ విలేకరి కింద పడిపోయారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. అతడి పేరు మాధవకృష్ణగా పోలీసులు పేర్కొన్నారు. వెంటనే పాత్రికేయుడిని ఆసుపత్రికి తరలించారు.