: హైదరాబాద్ రోడ్లపై అడుగుకో గుంత: కిషన్‌రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్ మహా నగరంలో రోడ్ల దుస్థితిపై బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రోడ్లపై అడుగుకో గుంత కనిపిస్తోందని అన్నారు. అధ్వానంగా మారిన రోడ్ల పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నేతలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రోడ్లపై గుంతలు ఉండడంతో వాహనదారులు ఎన్నో ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.