: హిందూపురంలో బుల్లెట్ నడుపుతూ అలరించిన బాలయ్య
టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం పర్యటన రెండో రోజుకు చేరుకుంది. ఈ రోజు స్థానిక పాండురంగనగర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పురపాలక ఉద్యానవనాన్ని ఆయన ప్రారంభించారు. పార్కులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, క్షీరాభిషేకం చేసి, నివాళి అర్పించారు. అనంతరం, బసవనపల్లి పాఠశాలలో రూ. 39 లక్షలతో నిర్మించిన భవనాలను ఆయన ప్రారంభించారు. అంతకు ముందు ఆటో నగర్ నుంచి స్వయంగా బుల్లెట్ నడుపుతూ వచ్చిన బాలయ్య తన అభిమానులను అలరించారు.