: స‌రిహ‌ద్దుల్లో మరో పాక్ గూఢ‌చారి అరెస్ట్‌.. పాకిస్థాన్ సిమ్‌కార్డులు, మ్యాప్‌లు స్వాధీనం


స‌రిహ‌ద్దు ప్రాంతాల్లోకి పాకిస్థాన్ నుంచి చొర‌బడుతున్న ఉగ్ర‌వాదులను భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. ఉగ్ర‌వాదులు చొర‌బ‌డ‌కుండా విస్తృతంగా సోదాలు నిర్వ‌హిస్తున్నాయి. హిరానగర్‌ సెక్టార్‌లో కాల్పులు జ‌రిపిన‌ పాక్‌ రేంజర్లను భార‌త సైన్యం హ‌త‌మార్చిన‌ మరుసటి రోజే ఓ పాకిస్థాన్‌ గూఢచారిని భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో ఉన్న అత‌డి వ‌ద్ద వద్ద నుంచి రెండు పాకిస్థానీ సిమ్‌ కార్డులు, మ్యాపులను స్వాధీనం చేసుకున్నారు. జమ్ములోని అర్నియా ప్రాంత వాసి అయిన‌ బోధ్‌రాజ్ ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు పేర్కొన్నారు. రెండు నెల‌ల క్రితం పాకిస్థాన్‌కు చెందిన మ‌రో గూఢచారిని రాజస్థాన్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గుర్తించిన సంగతి విదిత‌మే. అప్ప‌ట్లో అతడి వద్ద ప‌లు మ్యాపులు, ఫొటోలు ల‌భించాయి.

  • Loading...

More Telugu News