: తొలి గోల్డ్ మెడల్ నేపథ్యంలో అక్షయ్ కుమార్ సినిమా
'రుస్తుం', 'ఎయిర్ లిఫ్ట్' వంటి సినిమాలతో వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలీవుడ్ టాప్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మరో సినిమాను అనౌన్స్ చేశాడు. మరో పీరియడ్ డ్రామాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన అనంతరం, 1948లో జరిగిన లండన్ ఒలింపిక్స్ లో సాధించిన తొలి గోల్డ్ మెడల్ నేపథ్యంగా అక్షయ్ కొత్త సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిద్వానీలు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఆమీర్ తో 'తలాష్' చిత్రాన్ని తెరకెక్కించిన రీమీ కగ్టీ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాను 2018 ఆగస్టు 15న స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు అక్షయ్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మరోవైపు, రుస్తుం, ఎయిర్ లిఫ్ట్ సినిమాలు కూడా పీరియడ్ డ్రామాలుగా తెరకెక్కినవే.