: ఆర్మూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. షిర్డీ నుంచి వస్తుండగా ఘటన.. ముగ్గురి దుర్మరణం


నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవదర్శనానికి కారులో షిర్డీ వెళ్లిన కుటుంబం తిరుగు ప్రయాణంలో ఆర్మూరు మండలంలోని అంకాపూర్ వద్ద ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతులను గోదావరిఖనికి చెందిన ప్రభాకర్‌రావు, సరేందర్‌రావు, రాణిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News