: పెద్దపల్లిలో యువతి కిడ్నాప్‌కు యువకుడి యత్నం.. బైక్‌పై నుంచి దూకి తప్పించుకున్న బాధితురాలు


ఫోన్‌లో పరిచయమైన యువకుడు ఓ యువతిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు చాకచక్యంగా వ్యవహరించి బైక్‌పై నుంచి దూకి తప్పించుకుంది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలోని శాంతినగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక శాంతినగర్‌కు చెందిన ఓ యువతికి ఫోన్లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఆమెను వేధింపులకు గురిచేశాడు. తమ సంభాషణను ఫోన్లో రికార్డు చేసిన నిందితుడు ఆమెను బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమెను అపహరించేందుకు స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు. స్నేహితులతో కలిసి బైక్‌పై ఆమెను బలవంతంగా తీసుకెళ్తుండగా యువతి దానిపై నుంచి దూకి తప్పించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News