: పెద్ద నోట్ల నిషేధానికి అసెంబ్లీలో తీర్మానం.. టీడీపీ పొలిట్ బ్యూరోలో ‘గాలి’ ఆహ్వాన పత్రికపై చర్చ


టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కర్ణాటక మాజీ మంత్రి, ఓబుళాపురం గనుల అధినేత గాలి జనార్దనరెడ్డి కుమార్తె పెళ్లి వ్యవహారం చర్చకు వచ్చింది. గనుల అక్రమ తవ్వకాల ఆరోపణలతో చాలాకాలం జైలులో ఉండి బెయిలుపై బయటకొచ్చిన గాలి జనార్దన్ రెడ్డి ఇటీవల తన కుమార్తె పెళ్లి కార్డుతో మళ్లీ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. హైటెక్ తరహాలో అద్భుతంగా తీర్చిదిద్దిన ఆహ్వాన పత్రిక దేశవ్యాప్తంగా పలువురిని ఆకర్షించింది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలను మించి కుమార్తె పెళ్లి ఏర్పాట్లు చేయడం టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చనీయాంశమైంది. నల్లధనాన్ని విపరీతంగా పోగేసిన కొందరు పెళ్లిళ్ల సమయంలో ఇటువంటి హంగు, ఆర్భాటాలకు పోతున్నారని చాలామంది సభ్యులు అభిప్రాయపడ్డారు. దీనికి స్పందించిన చంద్రబాబు నల్లధనాన్ని నిరోధించేందుకే తాను రూ.1000, రూ.500 నోట్లను నిషేధించాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. అవసరమైతే ఈ విషయమై శాసనసభలో తీర్మానం చేద్దామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News