: బెర్ముడా ట్రయాంగిల్ వద్ద అందుకే నౌకలు, విమానాలు మునిగిపోతున్నాయట.. గుట్టు విప్పిన శాస్త్రవేత్తలు


అంతుచిక్కని రహస్యాన్ని ఎట్టకేలకు శాస్త్రవేత్తలు ఛేదించారు. బ్రెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ గుట్టు విప్పారు. అక్కడికి రాగానే నౌకలు, విమానాలు ఎందుకు అదృశ్యమవుతున్నాయో వివరించారు. శతాబ్దాలుగా అంతుచిక్కని ఈ రహస్యానికి అక్కడ ఏర్పడే షడ్భుజాకార మేఘాలే కారణమని తేల్చి చెప్పారు. గంటకు 273 కిలోమీటర్ల వేగంతో కదిలే ఆ ప్రాంతలోని మేఘాలు ఎయిర్ బాంబ్స్‌తో అనుసంధానమై ఉన్నాయని, వాటి వల్ల బెర్ముడా ట్రయాంగిల్ వద్ద పెను తుపాను వంటి గాలి తీవ్రత ఏర్పడడం వల్ల విమానాలు, నౌకలు నీటిలో మునిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రాడార్ శాటిలైట్ ఇమేజరీని ఉపయోగించి ఈ విషయాన్ని కనుగొన్నట్టు ర్యాండీ అనే శాస్త్రవేత్త తెలిపారు. మియామీ, పోర్టారికో, బెర్ముడా ద్వీపానికి మధ్య ఉన్న బెర్ముడా ట్రయాంగిల్‌ కొన్ని శతాబ్దాలుగా మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే. దీని మీదుగా వెళ్లే నౌకలు, విమానాలు ఒక్కసారిగా అదృశ్యమైపోతున్నాయి. దీనిపై విస్తృత పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు తాజాగా ట్రయాంగిల్‌పై ఏర్పడే షడ్భుజాకార మేఘాలే ఇందుకు కారణమని తేల్చారు.

  • Loading...

More Telugu News