: విపక్షాలు నోరెత్తుకు పడిపోతుంటే.. మీరెందుకు నోరెత్తడం లేదు.. మంత్రులపై సీఎం కేసీఆర్ ఫైర్
తెలంగాణ సర్కారు మెరుగ్గా పనిచేస్తున్నా విపక్షాలు మాత్రం ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మంత్రులు ఎప్పటికప్పుడు దీటుగా బదులివ్వాలని మంత్రులకు సూచించారు. ‘‘సమస్యలున్నాయంటూ రైతు గర్జనలు చేస్తున్నారు. సీ బ్లాక్ ముందు ధర్నాలు చేస్తున్నారు. అయినా మీరు చూస్తూ ఊరుకుంటారా? ఆర్థిక పరిస్థితి బాగాలేదని బదనాం చేస్తుంటే తిప్పికొట్టకుండా మీరేం చేస్తున్నారు? వారికెందుకు గట్టిగా సమాధానం చెప్పడం లేదు? వారి వాదనలను ఎందుకు ఖండించడం లేదు’’ అని మంత్రులపై సీఎం ఫైరయ్యారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ మంత్రులను నిలదీశారు. విపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు.