: బాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాలకు.. ‘హమారా బజాజ్’కు లింకు పెట్టిన నెటిజన్లు!


బాలీవుడ్ లో సూపర్ హిట్ చిత్రాలకు..‘హమారా బజాజ్’కు నెటిజన్లు లింక్ పెట్టారు. ఆ చిత్రాలు హిట్ కావడానికి అదే రహస్యమని అంటున్నారు. అదెలా అంటే.. బాలీవుడ్ బడా నటులు ఇటీవల విడుదలైన చిత్రాల్లో బజాజ్ కంపెనీ స్కూటర్లు నడుపుతూ కనపడతారు. ఉదాహరణకు.. కండలవీరుడు సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ‘తీన్’, బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించిన ‘రబ్ నే బనా ది జోడి’ చిత్రాల్లో బజాజ్ స్కూటర్లు నడుపుతూ కనపడతారు. తాజాగా, ‘దంగల్’ చిత్రంలో కూడా అమీర్ ఖాన్ బజాజ్ స్కూటర్ నడిపే సన్నివేశాలున్నాయి. కనుక, ఈ చిత్రం కూడా సూపర్ హిట్ అవుతుందని ట్విట్టర్ ఖాతా ద్వారా నెటిజన్లు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News