: బీఎస్ఎఫ్ చేతిలో ఏడుగురు పాక్ రేంజర్లు హతం


జమ్మూకాశ్మీర్ లోని హీరా నగర్ సెక్టార్ లో ఈరోజు ఉదయం పాక్ బలగాలు కాల్పులకు తెగబడటంతో, ఆ కాల్పుల్లో మన బీఎస్ఎఫ్ జవాన్ గాయపడటం విదితమే. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీఎస్ ఎఫ్ బలగాలు దీటుగా సమాధానం చెప్పాయి. ఒక ఉగ్రవాది సహా, ఏడుగురు పాక్ రేంజర్లను హతమార్చినట్లు బీఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. జమ్మూలో చొరబడాలన్నదే వారి ప్రధాన లక్ష్యమని, చొరబాటు యత్నాలను తాము తిప్పికొడుతున్నామని ఈ సందర్భంగా ఆ అధికారి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News