: ఒడిశా వైద్యశాఖ మంత్రి రాజీనామా


ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్ ఎస్ యుఎం ఆసుపత్రిలో అగ్నిప్రమాద సంఘటన నేపథ్యంలో ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సవ్యసాచి నాయక్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు పంపారు. అయితే, ఈ రాజీనామా లేఖను ఆయన ఆమోదించారా? లేదా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఎస్ యుఎం ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం సంఘటనలో 24 మంది చనిపోగా, పలువురు గాయపడ్డారు.

  • Loading...

More Telugu News