: పాకిస్థాన్ తో సబ్ మెరైన్ల డీల్ వాస్తవమేనన్న చైనా
తన మిత్ర దేశమైన పాకిస్థాన్ కు సబ్ మెరైన్లు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మాట వాస్తవమేనని చైనా అంగీకరించింది. ఈ మేరకు చైనా మిలిటరీ అధికారిక వెబ్ సైట్ లో పేర్కొన్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఒప్పందానికి చైనా షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ చైర్మన్ హు వెన్మింగ్ అంగీకరించినట్లు ఆ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. పాకిస్థాన్ కు ఎనిమిది ఎటాక్ సబ్ మెరైన్ల విక్రయానికి సంబంధించి సుమారు 5 బిలియన్ డాలర్లతో బీజింగ్ మిలిటరీ కుదుర్చుకున్న అతిపెద్ద ఒప్పందాల్లో ఇదొకటని సమాచారం. కాగా, నాలుగు సబ్ మెరైన్లను 2023 నాటికి సరఫరా చేయాలని, మరో నాలుగింటిని 2028 నాటికి పూర్తి చేయాలని చైనా భావిస్తున్నట్లు తెలుస్తోంది.