: కబడ్డీ వరల్డ్ కప్ సెమీఫైనల్.. థాయ్ లాండ్ తో తలపడనున్న భారత్
ఈరోజు రాత్రి 9 గంటలకు జరగనున్న2016- కబడ్డీ వరల్డ్ కప్ సెమీఫైనల్ లో థాయ్ లాండ్ తో భారత్ తలపడనుంది. అహ్మదాబాద్ లోని ట్రాన్స్ స్టేడియా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ లోకి దూసుకువెళ్లేందుకు భారత్ క్రీడాకారులు ఉవ్విళ్లూరుతున్నారు. ప్రత్యర్థులపై దూకుడుగా ఆడటమే కాకుండా డిఫెన్స్ తో వ్యవహరించే భారత్ కబడ్డీ టీమ్, థాయ్ లాండ్ టీమ్ పై పట్టు సాధిస్తుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. కాగా, మరో సెమీఫైనల్ ఇరాన్, దక్షిణ కొరియా మధ్య జరగనుంది.