: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. కోస్తాలోని అన్ని పోర్టుల్లో ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ
తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అది పోర్ట్ బ్లెయిర్ కు పశ్చిమ వాయవ్యదిశగా 500 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పారు. రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండం తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం తూర్పు ఈశాన్యంగా మాయన్మార్ వైపు వాయుగుండం పయనిస్తోందని, దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అంతగా ఉండబోదని చెప్పారు. కోస్తాలోని అన్ని పోర్టుల్లో ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.