: ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయాలంటూ ఆదేశించిన యాంటీ టెర్రరిస్ట్ కోర్టు
తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అధినేత, పాక్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయాలని పాకిస్థాన్ లోని యాంటీ టెర్రరిస్ట్ కోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ తో పాటు పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ చీఫ్ తహీరుల్ ఖాద్రీని కూడా అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2014 సెప్టెంబర్ 1న ప్రధాని నవాజ్ షరీఫ్ కు వ్యతిరేకంగా వీరిద్దరితో పాటు, వారి పార్టీలకు చెందిన కార్యకర్తలు పాక్ పార్లమెంటు ఎదుట ఆందోళన చేశారు. ఆ సందర్భంగా, సమీపంలోనే ఉన్న పీటీవీ కార్యాలయాన్ని ముట్టడించి, ఛానల్ ప్రసారాలను నిలిపివేశారు. ఈ ఘటనపై కేసు నమోదైనప్పటికీ, వారిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. వీరిద్దరితో పాటు మరో 68 మంది అనుచరులను నవంబర్ 17 నాటికి అరెస్ట్ చేయాలని ఆదేశించింది.