: నిబంధనలు ఉల్లంఘించకుండా పోలవరం నిర్మాణం జరుగుతుంది!: ఉమాభారతి
పోలవరం ప్రాజెక్టును నిబంధనలు ఉల్లంఘించకుండా తాము అనుకున్న గడువులోగా పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతి అన్నారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టుపై ఇతర రాష్ట్రాల నుంచి వస్తోన్న అభ్యంతరాలన్నింటినీ పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు ఎత్తుపై ఒడిశా ముఖ్యమంత్రి తెలిపిన అభ్యంతరాలకు పరిష్కారం దిశగా సందేహాలను నివృత్తి చేసినట్లు పేర్కొన్నారు. పోలవరంలో ఏపీతో పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉందని ఉమాభారతి అన్నారు. పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యత అంతా కేంద్రానిదేనని తేల్చిచెప్పారు. ప్రాజెక్టుకు కావాలసిన నిధులు సమకూరుస్తామని పేర్కొన్నారు. పోలవరం నిర్మాణంపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ తమకు లేఖ పంపించిందని తెలిపారు. నాబార్డు నిధులతో పోలవరం నిర్మిస్తామని అన్నారు.