: నా ఆస్తులపై ఆరోపణలు రుజువైతే రాజకీయ సన్యాసం తీసుకుంటా: మంత్రి పల్లె
తన ఆస్తులపై సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలన్నీ అసత్యాలేనని, ఆ ఆరోపణలు రుజువు చేయకపోతే ఆ పత్రికపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హెచ్చరించారు. ‘త్వరలోనే నా ఆస్తులు ప్రకటిస్తాను. సాక్షి పత్రికలో వచ్చిన ఆరోపణలు రుజువైతే కనుక నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను’ అని పల్లె రఘునాథరెడ్డి సవాల్ విసిరారు.