: హిల్లరీకే ప్రవాసాంధ్రుల మద్దతు ఉంటుందన్న 'తానా' కాబోయే అధ్యక్షుడు
హిల్లరీ క్లింటన్ కే ప్రవాసాంధ్రల మద్దతు ఉంటుందని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)కు కాబోయే అధ్యక్షుడు సతీశ్ వేమన పేర్కొన్నారు. వాషింగ్టన్ లో నిన్న హిల్లరీ తో ఆయన భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ విజయం సాధించడానికి తాము కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. భారత్ ప్రయోజనాల రీత్యా డెమోక్రాట్లు విజయం సాధించాలని తాము ఆకాంక్షిస్తున్నామని వేమన పేర్కొనడంపై హిల్లరీ హర్షం వ్యక్తం చేశారు. హిల్లరీతో పాటు ఉపాధ్యక్ష బరిలో ఉన్న టింకెయిని ని కూడా కలిశారు. వాషింగ్టన్ డీసీ, వర్జీనియా, మేరీ ల్యాండ్ తదితర రాష్ట్రాల్లో ఎన్ఆర్ఐల మద్దతు హిల్లరీకే ఉందని ఈ సందర్భంగా సతీశ్ వేమన స్పష్టం చేశారు.