: 20 సార్లు ఇంటర్వ్యూ చేస్తే, 3 సార్లు లైంగిక వేధింపులు: ట్రంప్ వెబ్ సైట్లో హిల్లరీ భర్తపై జర్నలిస్టు ఆరోపణల వీడియో


తనపై లెక్కకు మిక్కిలిగా లైంగికారోపణల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న డొనాల్డ్ ట్రంప్, అదే తరహా ఆరోపణలను ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పై చేసే అవకాశం లేకపోవడంతో, ఆమె భర్త, మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆయన వెబ్ సైట్లో బిల్ క్లింటన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న ఓ మాజీ జర్నలిస్టు వీడియో ప్రత్యక్షమైంది. క్లింటన్ అర్కన్ సాస్ గవర్నర్ గా 1980వ దశకంలో పనిచేసినప్పటి నుంచి తనకు తెలుసునని, తాను 20 సార్లు ఆయన్ను ఇంటర్వ్యూ చేశానని లెస్లీ మిల్వీ అనే ఈ జర్నలిస్టు చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూ నిమిత్తం టీవీ స్టేషన్ కు వచ్చినప్పుడు తనపై మూడు సార్లు క్లింటన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ వీడియో కేవలం చౌకబారు ప్రచారం మాత్రమేనని హిల్లరీ వర్గం కొట్టిపారేసింది.

  • Loading...

More Telugu News