: నా వేలు విరగలేదు.. బెణికింది: రకుల్ ప్రీత్ సింగ్
మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఛేజింగ్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అయితే, ఈ షూటింగ్ లో రకుల్ ప్రీత్ గాయపడిందని, ఆమె వేలు విరిగిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రకుల్ స్పందించింది. తన వేలు విరగలేదని, బెణికిందంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది. తాను కోలుకోవాలంటూ చేసిన అభిమానుల మెసేజ్ లకు తన ధన్యావాదాలని పేర్కొంది.