: ‘కృష్ణా న‌దీ నీటి పంప‌కాల‌ తీర్పుపై ఏం చేద్దాం?’... కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ


కృష్ణా న‌దీ నీటి పంప‌కాల‌పై ఇటీవ‌లే బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్ ఇచ్చిన‌ తీర్పుపై చ‌ర్చించ‌డ‌మే ప్ర‌ధానాంశంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పుపై మంత్రుల అభిప్రాయాన్ని తీసుకొని, ముందుకు వెళ్లే అంశంపై కేసీఆర్ చ‌ర్చిస్తున్నారు. స‌మావేశంలో తెలంగాణ‌ కొత్త సచివాలయం నిర్మాణం గురించి కూడా చ‌ర్చించే అవ‌కాశం ఉంది. రెండు రోజుల క్రితం కృష్ణా న‌దీ నీటి పంప‌కాల‌పై దేశ రాజ‌ధాని ఢిల్లీలో విచార‌ణ జ‌రిపిన ట్రైబ్యున‌ల్ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా జ‌లాలు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్యే పంపిణీ జ‌ర‌గాల‌ని సూచించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఈ అంశంపై త‌దుప‌రి విచార‌ణ‌ను డిసెంబ‌రు 14కు వాయిదా వేసింది. రాష్ట్రాల‌కు అభ్యంత‌రాల‌ు ఏమయినా ఉంటే నాలుగు వారాల్లోగా తెలపాల‌ని సూచించింది.

  • Loading...

More Telugu News