: ట్రంప్ వ్యాఖ్య‌లు శత్రుదేశాలను సైతం ఆకట్టుకుంటాయి: అమెరికా అధ్యక్షుడు బ‌రాక్ ఒబామా


అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే అంగీకరించబోనంటూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లపై ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు బ‌రాక్ ఒబామా స్పందిస్తూ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న చేసిన‌ వ్యాఖ్య‌లు ప్ర‌మాద‌క‌రంగా ఉన్నాయ‌ని అన్నారు. హిల్ల‌రీ క్లింట‌న్ త‌ర‌ఫున ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ... ట్రంప్ వ్యాఖ్య‌లు త‌మ దేశ‌ ప్ర‌జాస్వామ్యాన్ని కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు. విదేశీయులకు త‌మ‌ దేశ‌ ఎన్నికల స‌ర‌ళిపై భిన్నాభిప్రాయాలు కలిగే అవ‌కాశం ఉంద‌ని ఒబామా అన్నారు. ట్రంప్ వ్యాఖ్య‌లు శత్రుదేశాలను సైతం ఆకట్టుకునే అవ‌కాశం ఉందని చెప్పారు. ఇదిలా ఉండ‌గా, తాను చేసిన వ్యాఖ్య‌ల‌పై మ‌రోసారి ట్రంప్ స్పందిస్తూ... త‌న చేసిన వ్యాఖ్య‌ల‌పై మ‌ళ్లీ మాట‌మార్చారు. ఎన్నిక‌ల్లో ఏ తీర్పు వ‌చ్చినా స్వాగ‌తిస్తాన‌ని ఈ సారి పేర్కొన్నారు. అయితే, ఎన్నిక‌ల తీర్పు పార‌ద‌ర్శ‌కంగా ఉంటేనే అంగీక‌రిస్తాన‌ని అన్నాడు. స‌జావుగా జ‌ర‌గ‌క‌పోతే మాత్రం న్యాయ‌ పోరాటానికి దిగుతాన‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News