: లాలూ కుమారుడికి 44 వేల పెళ్లి ప్రపోజల్స్!
బీహార్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే... ఆర్జేడీ అధినేత లాలూ కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పేరు చెప్పవచ్చు. ఎందుకంటే... 'నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్' అంటూ ఏకంగా 44 వేల మంది అమ్మాయిలు తేజస్వికి ప్రపోజ్ చేశారు. ఈ ప్రపోజల్స్ అన్నీ వాట్సాప్ కు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే, ఎక్కడైనా రోడ్లు బాగాలేకపోతే, ఈ నెంబర్ కు మెసేజ్ పంపండని ఓ నంబర్ ఇచ్చాడు తేజస్వి. అది ఆయన పర్సనల్ నంబర్ అనుకుని 44 వేల మంది అమ్మాయిలు ఆయనకు ప్రపోజ్ చేశారు. తమ శరీర కొలతలు, రంగు, ఎత్తు, బరువు లాంటి పర్సనల్ విషయాలు కూడా మెసేజ్ లో తెలిపారు. మరో విషయం ఏమిటంటే, కేవలం 3 వేల మెసేజ్ లు మాత్రమే రోడ్ల గురించి వచ్చాయట. ఈ వివరాలను ఓ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. ఈ పెళ్లి ప్రపోజల్స్ గురించి 26 ఏళ్ల తేజస్వి యాదవ్ కూడా స్పందించారు. తాను ఇంకా బ్రహ్మచారినే కాబట్టి సరిపోయిందని... పెళ్లి అయి ఉంటే కష్టాల్లో పడేవాడినని సరదాగా వ్యాఖ్యానించారు. పెద్దలు కుదిర్చిన పెళ్లినే తాను చేసుకుంటానని స్పష్టం చేశారు.