: దుండగుల దుశ్చర్య... కదులుతున్న రైలులోంచి హోంగార్డును తోసేసిన వైనం
కదులుతున్న రైలు నుంచి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హోంగార్డును తోసేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలోని మదనాపురం మండలం కొన్నూరు వద్ద చోటుచేసుకుంది. దుండగులు చేసిన దుశ్చర్య పట్ల రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనలో సదరు హోంగార్డు నర్సింహకు తీవ్ర గాయాలయ్యాయినట్లు పోలీసులు తెలిపారు. మంచి నీళ్లు ఇవ్వలేదన్న కారణంతోనే దుండగులు హోంగార్డుపై ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.