: ఉల్లంఘనులపై ఉక్కుపాదం... హైదరాబాద్ లో ఏకంగా 2500 డ్రైవింగ్ లైసెన్స్ లు రద్దు!


సిగ్నల్ జంపింగ్, రాంగ్ పార్కింగ్, హెల్మెట్ లేకుండా బండ్లు నడపడం, ఓవర్ స్పీడింగ్ వంటివి తరచూ చేసేవారు ఇప్పుడిక తమ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటులో ఉందో లేదో ఒకసారి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తరచూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న 2,500 మంది డ్రైవింగ్ లైసెన్స్ లను రద్దు చేయాలని కోరుతూ ట్రాఫిక్ పోలీసులు ఆర్టీయేకు లేఖ రాశారు. ఇప్పటికే 500కు పైగా లైసెన్స్ లు రద్దయ్యాయి కూడా. వివిధ సిగ్నల్స్ వద్ద అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజ్ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు పదే పదే ఉల్లంఘించే వారి లైసెన్స్ లను రద్దుచేయాలని సిఫార్సు చేశారు. కాగా, 2011 నుంచి ఇప్పటివరకూ రూ. 300 కోట్లను జరిమానాగా విధించగా, రూ. 200 కోట్లకు పైగా వసూలైందని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News