: గెలుపు కోసం 10 శాతమైనా కృషి చేశానని ఎవరైనా చెప్పగలరా?: తన ఆటగాళ్లను ప్రశ్నించిన ధోనీ
న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో ఓడిపోయిన అనంతరం తన జట్టు సభ్యుల ఆటతీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను ఏ ఒక్క బ్యాట్స్ మెన్ గురించీ మాట్లాడటం లేదంటూనే, మొత్తం జట్టు విఫలమైందని అన్నాడు. గెలుపు కోసం తాను 10 శాతమైనా కృషి చేశానని ఒక్క ఆటగాడైనా చెప్పుకోగలడా? అని సంచలన ప్రశ్న సంధించాడు. ఓవర్ కు ఆరేడు పరుగులు సాధించడం కష్టమేమీ కాదని, అయితే, 41వ ఓవర్ లో రెండు వికెట్లు కోల్పోవడం కొంప ముంచిందని అన్నాడు. పార్ట్ నర్ షిప్ పెరగక పోవడం కూడా ప్రభావం చూపిందని చెప్పుకొచ్చాడు.