: అమ్మాయిలు చుడీదార్లు, చీరలు మాత్రమే ధరించాలి... డ్రెస్ కోడ్ ప్రకటించిన తిరువనంతనపురం మెడికల్ కాలేజీ
కేరళలోని తిరువనంతపురం మెడికల్ కాలేజీ మధురై మెడికల్ కాలేజీ బాటలో నడుస్తోంది. గతంలో మధురై మెడికల్ కాలేజీ విద్యార్థులకు డ్రెస్ కోడ్ ప్రకటించింది. దానిని అమలు చేస్తోంది. ఇప్పుడు తిరువనంతపురం వైద్య కళాశాల కూడా స్టూడెంట్స్ కు డ్రెస్ కోడ్ ప్రకటించింది. ఈ మేరకు కళాశాల వైస్ ప్రిన్సిపల్ సర్క్యులర్ జారీ చేశారు. దీని ప్రకారం కళాశాలలో తరగతులకు హాజరయ్యే విద్యార్థినులు చుడీదార్లు, చీరలు ధరించే రావాలి. విద్యార్థులు సాధారణ (క్యాజువల్) ప్యాంట్లు, ఫుల్ హ్యాండ్స్ చొక్కాలు, షూ కచ్చితంగా ధరించాలి. లెగ్గింగ్స్, జీన్స్ ధరించి కళాశాలకు రాకూడదు అని స్పష్టం చేశారు. కంఫర్ట్ పేరుతో చిత్రవిచిత్రమైన దుస్తులు ధరించే పద్ధతికి స్వస్తి చెప్పడంలో భాగంగా డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నట్టు తెలిపారు.