: భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఖరారు... వివరాలు


బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య భారత్ లో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్ షెడ్యూల్ ఖరారయింది. ఫిబ్రవరి 23న ఈ సిరీస్ ప్రారంభమవుతుంది. సిరీష్ షెడ్యూల్ వివరాలు... తొలి టెస్ట్: ఫిబ్రవరి 23-27, వేదిక - పూణె రెండో టెస్ట్: మార్చ్ 4-8, వేదిక - బెంగళూరు మూడో టెస్ట్: మార్చ్ 16-20, వేదిక - రాంచీ నాలుగో టెస్ట్: మార్చ్ 24-28, వేదిక - ధర్మశాల ఈ సిరీస్ కు సంబంధించిన తేదీలను బీసీసీఐ ఇంతకు ముందే ప్రకటించినప్పటికీ, వేదికలను మాత్రం ఈ రోజు ఖరారు చేసింది. 2013లో ఇండియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ 4-0తో గెలుచుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో 2014-15లో జరిగిన ట్రోఫీని ఆస్ట్రేలియా 2-0తో కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్ హ్యూజెస్ మరణానంతరం ఆ సిరీస్ జరిగింది.

  • Loading...

More Telugu News