: రిలయన్స్ 4జీ స్పీడ్ ఎంతో తెలుసా? టాప్ -5 కంపెనీల్లో ఆఖరు స్థానం!: ట్రాయ్ పరీక్షల్లో వెల్లడి


జియో పేరిట 4జీ సేవల తరంగాలను దేశవ్యాప్తంగా అందిస్తున్న రిలయన్స్ నెట్ వర్క్ లో డేటా బట్వాడా వేగం అతి తక్కువగా ఉంది. ట్రాయ్ నిర్వహించిన పరీక్షా ఫలితాలు వెల్లడి కాగా, ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ ల కన్నా జియో 4జీ వేగం తక్కువగా ఉంది. ఈ విషయాన్ని ట్రాయ్ తన అధికారిక వెబ్ సైట్లో ఉంచుతూ ఫలితాలను ప్రకటించింది. ఎయిర్ టెల్ సెకనుకు 11.4 మెగాబైట్ల డేటాను బట్వాడా చేస్తుండగా, ముఖేష్ సోదరుడు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ 7.9 ఎంబీపీఎస్ వేగాన్ని అందుకుని రెండవ స్థానంలో నిలిచింది. ఆపై ఐడియా 7.6 ఎంబీపీఎస్ తో, వోడాఫోన్ 7.3 ఎంబీపీఎస్ వేగంతో సేవలందిస్తుండగా, జియో 6.2 ఎంబీపీఎస్ వేగాన్ని మాత్రమే నమోదు చేసింది. ఇక ఇదే విషయమై రిలయన్స్ జియో స్పందిస్తూ, ట్రాయ్ విశ్లేషణ గణాంకాలను తప్పుబట్టింది. ట్రాయ్ ఫలితాలపై తాము అంతర్గత విశ్లేషణ జరుపుతున్నామని, జియో వేగాన్ని ఇతర కంపెనీలతో పోల్చరాదని పేర్కొంది. డేటా వాడకాన్ని బట్టి వేగం మారడం సహజమని వెల్లడించింది.

  • Loading...

More Telugu News