: ప్రకటించుకునేంత ఆస్తులు మా వద్ద లేవు: ఎంపీ కవిత
ప్రకటించుకునేంత ఆస్తులు తమ వద్ద లేవని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత అన్నారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... తాము ఎవరికి లెక్క చూపించాలో వారికే చూపిస్తామని వ్యాఖ్యానించారు. కాగా, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాన్ని టీపీసీసీ నేత జానారెడ్డి మానుకోవాలని ఆమె సూచించారు. ప్రభుత్వం చేసే పనులపై అనవసర రాద్ధాంతం వద్దని అన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం చేసే పనులను తెలుసుకోవచ్చని ప్రతిపక్ష పార్టీకి ఆమె సూచించారు. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు ప్రత్యేక బడ్జెట్ తీసుకొస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దారుణ పరిస్థితులు ఉన్నాయని, వాటిని చక్కదిద్దుతున్నామని పేర్కొన్నారు.