: ఆగిన ఎయిర్ టెల్ 4జీ... వేల కొద్దీ ఫిర్యాదులు!


న్యూఢిల్లీ సహా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక సర్కిళ్ల పరిధిలో ఎయిర్ టెల్ 4జీ సేవలు 10 గంటల పాటు నిలిచిపోగా, కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ఎయిర్ టెల్ కస్టమర్ కేర్ కు వేల కొద్దీ ఫిర్యాదులు వచ్చాయని 'అవుట్ లుక్' వెల్లడించింది. 4జీ సర్వీసులు అందడం లేదని, ఎక్కడ చూసినా సిగ్నల్స్ కనిపించలేదని పలువురు వినియోగదారులు ఆరోపించారు. నిన్న ఉదయం నుంచి సిగ్నల్స్ బలం తగ్గుతూ రాగా, రాత్రికి అకస్మాత్తుగా తరంగాలు నిలిచిపోయాయని, ఎన్ని కాల్స్ చేసినా కస్టమర్ కేర్ ఉద్యోగులు ఎత్తలేదని పలువురు ఆరోపించారు. కాగా, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇబ్బందులు తలెత్తాయని, ఈ ఉదయానికి సమస్యను పరిష్కరించామని ఎయిర్ టెల్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. తమ కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు తెలిపింది. ఇకపై ఇలా జరుగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.

  • Loading...

More Telugu News