: ‘మారని తీరు’... మరోసారి సరిహద్దుల్లో పాకిస్థాన్ కాల్పులు


పాకిస్తాన్, భారత్ సరిహద్దులో పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తీరు మార్చుకోకుండా పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాలకు తూట్లు పొడుస్తోంది. భారత్ సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత కూడా తరుచుగా కాల్పులు జరుపుతూ భారత జవాన్ల సహనాన్ని పరీక్షిస్తోంది. ఈ రోజు జమ్మూకశ్మీర్‌లోని హీరానగర్ సెక్టార్‌లో బీఎస్‌ఎఫ్ స్థావరాలపై పాక్ సైన్యం మ‌రోసారి కాల్పులు జరపడంతో ఓ బీఎస్‌ఎఫ్ జవానుకు గాయాల‌య్యాయి. కాల్పుల‌ను భార‌త జ‌వాన్లు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. మ‌రోవైపు బారాముల్లాలో ఆర్మీ, పోలీసుల సోదాలు కొన‌సాగుతున్నాయి.

  • Loading...

More Telugu News