: సెహ్వాగ్ కోరిన జన్మదిన కానుకను ఇవ్వని కోహ్లీ!
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన 38వ పుట్టిన రోజును పురస్కరించుకుని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఓ కోరిక కోరాడు. అయితే సెహ్వాగ్ కోరికను విరాట్ తీర్చకపోవడం విశేషం. నిన్న వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజన్న సంగతి తెలిసిందే. తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సెంచరీ చేసి, తనకు బహుమతిగా ఇవ్వాలని కోహ్లీని వీరూ కోరాడు. దానికి కోహ్లీ కూడా సరేనన్నాడు. అయితే న్యూజిలాండ్ అద్భుతమైన బౌలింగ్, ఫీల్డింగ్ కు విరాట్ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ వన్డేలో కోహ్లీ కేవలం 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో సెహ్వాగ్ కోరిక విరాట్ తీర్చలేకపోయాడు.