: హైదరాబాద్ శివార్లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం
హైదరాబాద్ శివార్లలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు లభించడం కలకలం రేపుతోంది. అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిల్వ ఉన్న పేలుడు పదార్థాల గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో, అక్కడి గుట్టలో అక్రమంగా ఈ పేలుడు పదార్థాలను నిల్వ ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓ ముఠా ఈ పేలుడు పదార్థాలు అక్కడ నిల్వచేసినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.