: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో విస్తృత గాలింపు


జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా ప్రాంతంలో ఈ రోజు ఉద‌యం భార‌త సైన్యం, పోలీసులు క‌లిసి సంయుక్తంగా సోదాలు నిర్వ‌హించారు. భారత్‌-పాక్‌ సరిహద్దు ప్రాంతమైన ఆ ప్రాంతంలో ఇటీవల జరిపిన త‌నిఖీల్లో పాకిస్థాన్‌, చైనా దేశాల‌కు చెందిన జాతీయ‌ పతకాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ రోజు మ‌రోసారి ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపట్టారు. భార‌త్‌, పాక్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన‌డం పాకిస్థాన్‌కు చైనా మ‌ద్ద‌తు ప‌లుకుతుండ‌డంతో సైనికులు దేశంలో ఎటువంటి అల‌జ‌డి చెల‌రేగ‌కుండా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News