: విశాఖ ఏజెన్సీని వణికిస్తున్న చలి
విశాఖఏజెన్సీని చలిపులి బెంబేలెత్తిస్తోంది. ఇంకా నవంబర్ ప్రారంభం కాకుండానే ఇక్కడి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. సాయంత్రం నుంచి మంచు దుప్పటి కప్పేస్తోంది. ఏజెన్సీ పల్లెల్లో బారెడు పొద్దెక్కినా బయటకు రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. దీంతో పర్యాటకుల తాకిడి ప్రారంభమవుతున్నా, వ్యవసాయాధారిత కుటుంబాలు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. నిన్న 17 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు నేడు 15 కు పడిపోయాయి. ఏపీ సిమ్లా లంబసింగిలో పది డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చంతపల్లి, పాడేరుల్లో కేవలం 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో డిసెంబర్ లో మరింత దిగువకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.