: రిలయన్స్ జియోకు క్లీన్ చిట్... నిరాశలో ఇతర టెలికాం ఆపరేటర్లు
రిలయన్స్ జియోకు ఊరట లభించింది. జీవిత కాల వ్యవధిలో ఈ సంస్థ ఉచితంగా అందించే వాయిస్ కాల్స్ కు సంబంధించిన వ్యవహారంలో క్లీన్ చిట్ వచ్చింది. రిలయన్స్ జియో టారిఫ్ ప్లాన్స్ ఆమోదయోగ్యంగానే ఉన్నాయని ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) స్పష్టం చేసింది. ట్రాయ్ దగ్గర రిలయన్స్ జియో నమోదు చేసిన టాఫ్ ప్లాన్స్ ఆమోదయోగ్యంగా లేవని, మార్కెట్ ను దోపిడీ చేసే విధంగా ఉన్నాయంటూ ఇతర టెలికాం ఆపరేటర్లయిన ఎయిర్ టెల్, వొడాఫోన్ తో పాటు ఇతర సంస్థలు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో, ఇతర సంస్థల ఆరోపణలను కొట్టిపడేస్తూ, జియోకు క్లీన్ చిట్ ఇచ్చింది ట్రాయ్. ఈ మేరకు ఇతర టెలికాం కంపెనీలకు లేఖలు రాసింది. రిలయన్స్ జియోకు ట్రాయ్ క్లీన్ చిట్ ఇవ్వడంతో, ఇతర టెలికాం కంపెనీలు నిరాశలో మునిగిపోయాయి. జీవితకాల ఉచిత కాలింగ్ సౌకర్యంతో పాటు, డిసెంబల్ 31 వరకు అపరిమిత ఉచిత 4జీ సేవలను అందించనున్నట్టు జియో ప్రకటించిన సంగతి తెలిసిందే.