: వికెట్లు పడిపోవడమే కొంప ముంచింది: ధోనీ
టీమిండియా రెండో వన్డేలో ఓటమిపాలవ్వడానికి కారణం వరుసగా వికెట్లు కోల్పోవడమేనని కెప్టెన్ ధోనీ అభిప్రాయపడ్డాడు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసిందని ధోనీ అన్నాడు. అంతే కాకుండా న్యూజిలాండ్ ఆటగాళ్లు అద్భుతంగా పోరాడారని కితాబునిచ్చాడు. ఈ ఓటమితో మూడో వన్డేలో మరింత కసిగా ఆడతామని అన్నాడు. తమ బౌలర్లు, బ్యాట్స్ మన్ రాణించినప్పటికీ భారీ స్కోర్లు సాధించడంలో వెనుకబడ్డామని చెప్పాడు. కోహ్లీ, కేదార్ జాదవ్, తనతో పాటు హార్డిక్ పాండ్య కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం జట్టు విజయంపై ప్రభావం చూపిందని ధోనీ అన్నాడు. ఈ మ్యాచ్ లో తమ వైఫల్యంతో పాటు, న్యూజిలాండ్ ఆటగాళ్ల పోరాట పటిమ కూడా వారికి విజయాన్ని కట్టబెట్టిందని తెలిపాడు. మూడో వన్డేలో విజయం సాధిస్తామని ధోనీ తెలిపాడు.