: ఊహించని ఓటమి... జపాన్ క్రీడాకారిణి చేతిలో ఓడిపోయిన ఒలింపిక్ స్టార్ సింధూ


రియోలో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత్ కు రజత పతకం తెచ్చిపెట్టిన ఏస్ షట్లర్ పీవీ సింధూకు ఊహించని ఓటమి ఎదురైంది. ఓడెన్స్ లో జరుగుతున్న డెన్మార్క్ సూపర్ సిరీస్ లో గత సంవత్సరం రన్నరప్ గా నిలిచిన సింధూ, ఈ దఫా అనూహ్యంగా రెండో రౌండులోనే ఓటమితో వెనుదిరిగింది. జపాన్ కు చెందిన ఆరో సీడ్ క్రీడాకారిణి సయాక శాటోతో ఆడిన సింధూ 13-21, 23-21, 18-21 తేడాతో ఓడిపోయింది. సింధూ అనవసర తప్పిదాలే మ్యాచ్ ని ఆమెకు దూరం చేశాయని క్రీడా నిపుణులు వ్యాఖ్యానించారు. శాటో అద్భుతంగా ఆడకపోయినా, ఆమె సంధిస్తున్న సాధారణ స్ట్రోక్ లను ఎదుర్కోవడంలో సింధు విఫలమై మ్యాచ్ ని చేజార్చుకుంది.

  • Loading...

More Telugu News