: ఏడిదిగా కుమార్తెపై అత్యాచారానికి పాల్పడుతున్న కసాయి తండ్రి
సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి హైదరాబాదులోని పహడీషరీఫ్ కు పదేళ్ల క్రితం వలస వచ్చాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలతో కలిసి భార్యాభర్తలు ఓ పరిశ్రమలో కూలీలుగా పనిచేస్తున్నారు. కుమార్తెపై కన్నేసిన ఆ దుర్మార్గుడు ఏడాది కాలంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇది అతని భార్యకు తెలిసినా మౌనంగా ఉండడం విశేషం. ఈ విషయం ఎవరికైనా చెబితే కుటుంబం మొత్తాన్ని అంతమొందిస్తానని బెదిరింపులకు దిగుతున్నాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చడాన్ని వారు అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని, ఇరుగు పొరుగు వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విచారించిన పోలీసులు, వివరాలు తెలుసుకుని షాక్ తిన్నారు. దీంతో కేసు నమోదు చేసి, కసాయి తండ్రిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపారు.