: అమెరికా చరిత్రలో గరిష్ఠంగా ఓటర్ల నమోదు...ఎంత మంది ఓటర్లున్నారో తెలుసా?


అమెరికాలో గతంలో ఎన్నడూ లేని విధంగా తాజా అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు ఓటర్లు ఉత్సాహంగా ముందుకొస్తున్నారని ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 8న జరగనున్న నేపథ్యంలో ఓటేసేందుకు, ఓటర్లు విరివిగా రిజిస్ట్రేషన్ లో పాలుపంచుకుంటున్నారని ఆ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇప్పటివరకు 20 కోట్లమంది అమెరికన్ ఓటర్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఆ స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది. ఇంత భారీ సంఖ్యలో ఓటర్లు నమోదు చేసుకోవడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి అని ఆ స్వచ్ఛంద సంస్థ తెలిపింది. 2008 అధ్యక్ష ఎన్నికల నాటికి అమెరికాలో 14.6 కోట్ల మంది ఓటుహక్కు కలిగి ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. భారీ ఎత్తున ఓటర్లు నమోదు చేయించుకోవడంతో అధ్యక్షుడ్ని ఎన్నుకోవడంలో అమెరికా పౌరుల పాత్రను ముఖ్యమైనదిగా గుర్తిస్తున్నారని ఆ స్వచ్ఛంద సంస్థ అభిప్రాయపడింది.

  • Loading...

More Telugu News