: జీహెచ్ఎంసీ ఉద్యోగి వద్ద కోటి రూపాయల అక్రమాస్తుల గుర్తింపు


గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ లో అవినీతి తిమింగలాన్ని అవినీతి నిరోధక శాఖాధికారులు పట్టేశారు. వివరాల్లోకి వెళ్తే... జీహెచ్‌ఎంసీ అబిడ్స్ శాఖలో బిల్ కలెక్టర్ గా పని చేస్తున్న నర్సింహారెడ్డి అవినీతికి పాల్పడుతున్నాడని, ఆయన భారీగా అక్రమాస్తులు సంపాదించుకున్నారంటూ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆయన నివాసంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కూకట్‌ పల్లిలోని శాతవాహననగర్‌ లో నర్సింహారెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో కోటికి పైగా అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News