: మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీదేవి ఆత్మహత్యాయత్నం


గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ శ్రీదేవి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. పురుగుల మందు తాగి శ్రీదేవి ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మూడు నెలల క్రితం ఆమె భర్త మల్లికార్జునరావు గుండెపోటుతో మృతి చెందారు. అప్పటి నుంచి తీవ్ర కుంగుబాటుకు గురైందని తెలుస్తోంది. కాగా, ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News