: నెల్లూరు, జనగామల్లో రోడ్డు ప్రమాదాలు.. ముగ్గురి మృతి


నెల్లూరు జిల్లా, జనగామ జిల్లా కేంద్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపూడి వద్ద, చిలుకూరులోని సంతకు గొర్రెలను తరలిస్తుండగా ట్రాలీ ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో ప్రక్కన నిల్చున్న ముగ్గురు అక్కడికక్కడ మృతిచెందగా, పది గొర్రెలు కూడా మృత్యువాతపడ్డాయి. మరో ఘటనలో జనగామ జిల్లా కేంద్రంలో రోడ్డుపై ఏడుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొట్టంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

  • Loading...

More Telugu News