: జాతీయగీతం వస్తుంటే నిలబడ(లే)ని ఆయనపై మండిపడ్డారు... అసలు విషయం తెలిసి బాధపడ్డారు!


జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో రచయిత, అంగవైకల్య ప్రచారకర్త సలిల్ చతుర్వేది నిలబడలేదంటూ ఒక దంపతుల జంట ఆయనపై మండిపడ్డ సంఘటన గోవాలో జరిగింది. పనాజీలోని ఓ మల్టీప్లెక్స్ లో జరిగిన ఒక కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఇదే కార్యక్రమానికి ఆ దంపతులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ గీతం ఆలపించారు. అయితే, వెన్నుముక వ్యాధితో బాధపడుతున్న ఆయన మాత్రం తన చక్రాల కుర్చీలో కూర్చునే జాతీయ గీతం ఆలపించారు. చతుర్వేది అనారోగ్య సమస్య గురించి తెలియని ఆ దంపతులు ఆయనపై మండిపడ్డారు. అంతేకాకుండా, చతుర్వేదిపై చెయ్యి కూడా చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న ఆ దంపతులు బాధపడ్డారు. తెలియక చేసిన తప్పుకు గాను వారు క్షమాపణలు చెప్పారు.

  • Loading...

More Telugu News