: చేజారిన రెండో వన్డే.. 6 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం


ఢిల్లీలో హోరాహోరీగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి పాలైంది. చివర్లో హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ సత్తా చూపిస్తూ ఒంటరి పోరాటం చేసినా మ్యాచ్ చేజారిపోయింది. 6 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించడంతో భారత్ పర్యటనలో తొలి విజయాన్ని సొంతం చేసుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా అన్ని వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేసింది. రెండు జట్ల స్కోరు వివరాలు..న్యూజిలాండ్ 242/9, భారత్ 236/ ఆలౌట్ టీమిండియాలో.. శర్మ (15), రహానె(28), కోహ్లీ (9), పాండే (19), ధోనీ (39), జాదవ్(41), పటేల్ (17), మిశ్రా (1), పాండ్యా (36), బుమ్రా డక్కవుట్ కాగా ఉమేష్ యాదవ్ నాటౌట్ గా నిలిచాడు.

  • Loading...

More Telugu News